పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీని కోసం ఐఆర్‌సీటీసీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని పేర్కొంది. ఏసీ-1 టైర్ కోచ్‌లోని 2 లేదా 4 బెర్త్‌ల కూపేల్లో మాత్రమే పెంపుడు జంతువులను అనుమతిస్తారు. మొదటి చార్ట్ తయారైన తర్వాతే ప్రయాణికులు తమ పెంపుడు జంతువుల కోసం యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా పెట్స్‌కు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.