పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డు 479 సచివాలయం పరిధిలోగల ఇందిరానగర్, అప్పాజీ టవర్స్, ఎం వివి హిల్స్, గణేష్ నగర్ లలో జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలోశనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త, ఏపీ ఎమ్ ఎస్ ఎమ్ ఈ డి సి చైర్మన్ శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ విచ్చేసి సుమారు 450 గడపలను సందర్శించి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తూ మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాల కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన విధంగా మాట తప్పకుండా పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి ఫలాలను ఎటువంటి వర్గ విభేదములు లేకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఒక్కరికి అందజేస్తుందని ప్రభుత్వ పథకాలను ఇటువంటి అవినీతి లేకుండా అందజేయడమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పని చేస్తుందని రానున్న కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 91 వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, కన్వీనర్లు త్రినాధ్, అనురాధ, కిషోర్, రాజు, కరణం కన్నారావు, వాసు, బండారు శ్రీనివాసరావు, కంపర కోటేశ్వరరావు, గొంతిన నాగరాజు, కంపర సత్తిబాబు, జీవి రమణ, దాసరి శ్రీను, లోకేష్ రెడ్డి, శివాజీ, ఊటపల్లి గోవిందు, సి ఓ సభల కుమారి, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు, గృహ సారధులు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.