విశాఖ ఎయిర్ పోర్టు పోలీసు స్టేషన్ పరిథి లో శనివారం వేకువ జామున భారీ చోరీ జరిగింది. ఈమేరకు ఎన్ ఏడీ కొత్త రోడ్ గణేష్ నగర్ వద్ద వాసవి టవర్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం వేకువ జామున సుమారు రెండు గంటల సమయంలో ప్లాట్ లో చొరబడి ఇంటి బిరువాలో ఉన్న సుమారు 23 తులాల బంగార నగలను దొంగిలించినట్లు బాదితుడు పిర్యాదులో పేర్కొన్నాడు. విశయం తెలుసుకున్న క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎయిర్ పోర్టు ఎస్ ఐ కాంతారావు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.