గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వార్డు మాధవధార సచివాలయం 1086291 మాధవధార కళింగ నగర్ వుడా కాలనీ కోటర్స్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు 51వార్డు కార్పొరేటర్ రేయ్యి వెంకట రమణతో కలిసి శనివారం పర్యటించారు.
కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని వై. యస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పైడి శ్రీను, ద్దిడి రమేష్, రాయుడు శ్రీను, నూకరాజు, తిరుమల రావు, పైడి ప్రతాప్, రత్నం, దమయంతి, వై వరలక్ష్మి, రాణి, శ్యామ్, గణేష్, బి. రాజేశ్వరరావు, మైలపల్లి శ్రీను, జి. రామమోహన్ రావు, యువజన విభాగం ఇంచార్జ్ ఎం. సునీల్, షేక్ బాబ్జి, కె. చిన్న, సీపాన రాము, గురువోజీ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.