ముఖాముఖి స్పందన కార్యక్రమంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జయరాం అధ్యక్షతన నేరుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై అర్జీదారులతో నేరుగా మాట్లాడి అక్కడికక్కడే అధికారులతో చర్చించి పలు సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐ నమ్మి గణేశు, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.