ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వం: భీమినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2023, 02:01 PM

2019లో వైసిపి పార్టీ మోసపూరితమైన హామీలను ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ప్రభుత్వమని సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు ఆరోపించారు. గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని స్థానిక టిడిపి అన్న క్యాంటీన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ యువతతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక నిరుద్యోగ ఉద్యోగం కానీ , ఒక్క డీఎస్సీ కూడా అమలు చేయడం లేదని అన్నారు. ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ లిక్కర్ రెడ్ సెంట్రల్ మాఫియా ద్వారా డబ్బులు నింపుకోవడమే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఏ ప్రణాళికలు చేపట్టాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఈ వైసిపి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో 6 మండల అధ్యక్షులు నిరుద్యోగ యువకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com