రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు మా వి ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం వి ఆర్ పురం మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ మడకం రామకృష్ణకి మెమోరాడం ఇవ్వటం జరిగింది.
అలాగే రాష్ట్రంలో గత పది రోజులు గా కురుస్తున్న అకాల వర్షాలతో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు నష్టపోయి ఉన్న రైతులకు ధాన్యంతో పాటు మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి మరియు తదితర పంటలు దెబ్బతిన్న వాటన్నింటికి పంట నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, కార్యదర్శి బురక కన్నా రావు, జడ్పిటిసి వాళ్ల రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు, ఎంపీటీసీ వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి సవలం రాజేంద్రప్రసాద్, నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు బీరక. సూర్య ప్రకాష్ రావు, కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం, ఉపాధ్యక్షులు ముత్యాల రాంబాబు, ట్రెజరరీ పెందుర్తి సుదర్శన్ రావు, సర్పంచ్ అందెల సీతారామరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ వాళ్ళ కోటేశ్వర రెడ్డి, ముత్యాల పోసి బాబు, తదితరులు పాల్గొన్నారు.