టీడీపీ హయాంలో నాసిరకంగా చేసిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ తీసుకోవాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం, ధర్నా చేయడం తప్ప దేనికి పనికిరారన్నారు. సమస్యను సృష్టించి మరీ.. దాని ముందు సెల్ఫీ తీసుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వేసిన రోడ్లు ఏ విధంగా నాశనమయ్యాయో సెల్ఫీలు తీసుకుంటూపోతే అప్లోడ్ చేయడానికి ఫేస్బుక్ పేజీలు కూడా సరిపోవన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఎవరు ప్రజల్లో తిరుగుతున్నారు.. ఎవరు కనిపించడం లేదనేది ప్రజలకు తెలుసని, 2024లో వైయస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారన్నారు.