కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వెంకటరమణ లు శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాలను దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈ. వో వెంకటేశు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీవో రేణుక, డి. ఎస్. పి శ్రీనివాస్ మూర్తి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ శ్రీధర్ బాబు, చిత్తూరు కోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది, ఐరాల ఎమ్మార్వో, కాణిపాకం ఎస్సై, తదితరులు పాల్గొన్నారు.