వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేశారు. సామాజిక విప్లవం కోసం బాల్య వివాహాలు జరగకుండా చదువుకు ప్రోత్సాహం ఇవ్వాలని 10 వ తరగతి చదవాలనే ఆలోచన గొప్ప కార్యక్రమం, మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం పేదల కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది, మీ ఆలోచనలకు ధన్యవాదాలు అంటూ మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు.