అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతి రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని, తడిసిన, రంగుమారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని చెప్పారు. 35 లక్షల మెట్రిక్ టన్నులు అయినా సరే.. పూర్తిస్థాయిలో తడిచిన, రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.