తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన నాసిరకం పనుల ముందు సెల్ఫీలు తీసుకుంటూపోతే.. అప్లోడ్ చేయడానికి ఫేస్బుక్లో పేజీలు కూడా సరిపోవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సెల్ఫీల పేరుతో సంక్షేమ ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరులో 11వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.