కష్టజీవుల నివాసాలతోనే నిజమైన రాజధాని అవుతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్యాయమైన డిమాండ్‌తో కొందరు పిటిషన్ వేశారని, హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిందన్నారు. సామాజిక అసమతుల్యత అనేవారికి ఈ తీర్పు చెంపదెబ్బ. న్యాయం ఎలా ఉండాలో కోర్టు తీర్పు అలా ఉంది. పేదలకు అమరావతిలో నివసించే అవకాశం లేదనడం దుర్మార్గం. అలాంటి ప్రయత్నం చేయడమే దుస్సాహసం. త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామన్నారు. అకాల వర్షాలు పడితే పంట నష్టం జరుగుతుంది. అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. రైతులను ఆదుకునే అన్ని చర్యలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా సీఎం జగన్ ఎప్పటికప్పుడు నష్టపరిహారం అందించారు. 2014-19 మధ్య నష్టపరిహారం ఎలా ఇచ్చాడో చంద్రబాబు చెప్పాలి. ఓ సీఎం ఎలా పని చెయ్యాలో రోల్ మోడల్ జగన్. అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుగకుండా సీఎం ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.