తిరుపతి జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. నేడు (ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వై. ప్రవీణ్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈశిబిరం జరగనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.