తిరుపతి నగరంలోని నెహ్రూ నగర్, ఐఎస్ మహల్ సెంటర్ వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది. కమిషనర్ హరిత, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి శనివారం సాయంత్రం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. వెంటనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.