పదో తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో 69. 53 శాతం మంది పాస్ అయ్యారు. జిల్లాలో బాలికలు 10304 మంది పరీక్షలు రాయగా. 7692 మంది పాస్ అయ్యారు. 74. 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. 11086 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా 7181 మంది పాస్ అయ్యారు. 62. 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తిరుపతి జిల్లాలో 78. 51 శాతం మంది అమ్మాయిలు, 73. 16 శాతం మంది అబ్బాయిలు పాసయ్యారు. రెండు జిల్లాల్లోనూ అమ్మాయిలే టాప్లో ఉండటం విశేషం.