గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి అన్నమయ్య జిల్లా, కెవి పల్లి మండలంలో చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా శనివారం గర్నిమిట్ట పంచాయితీ, కొత్త కురవపల్లికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కురువ సంఘం జల్లా నాయకులు బెల్లా జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కురువగా పిలవబడే మాదాసి, మాదారి కురువ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కుల సభ్యులు ఆయన్ను కోరారు. ఇదే విషయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్లడం జరిగిందని తెలియజేశారు. గ్రామ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామ నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బండి హరి, బాలకృష్ణ, హరికృష్ణ, గురప్ప, మహేష్, శివశంకర్, ఆదినారాయణ, బండి రేణుక, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.