రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే పీలేరు నియోజకవర్గంలోని కెవి పల్లి మండలం, గర్నిమిట్ట గ్రామ సచివాలయ పరిధిలో బాటవారిపల్లి, బాటవారిపల్లి హరిజన వాడ, మిరియాలవారిపల్లి, కురవపల్లి, రెడ్డిమల్లువారిపల్లిలో పర్యటించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వారు ఎంత లబ్ధి పొందారన్నది వివరించారు. సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు తెలియజేశారు. ప్రజలే దేవుళ్ళుగా భావించి, నాలుగేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గజ్జల శృతి రెడ్డి, మండల కన్వీనర్ వెంకట్రమణారెడ్డి, మండల యూత్ కన్వీనర్ గజ్జల శీను రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుండ్లూరి జయరామచంద్రయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.