ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడి హీరోగా నిలిచిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 10:10 AM

ఆత్మహత్య చేసుకుకోవడానికి ప్లాట్ ఫామ్ పై నుంచి నేరుగా పట్టాల మీదకు వెళ్లి ట్రైన్ కు అడ్డంగా నిల్చున్నాడు ఓవ్యక్తి. అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ డిఎస్ గిరి సాహసం చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ వ్యక్తిని కాపాడాడు. ఇంతలోనే రైలు వారిద్దరినీ దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఈ దృశ్యాలు శ్రీకాకుళం రైల్వేస్టేషన్ లోని సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. దీంతో అతని ధైర్యసాహసాలు విశాఖలోని వాల్తేర్ డివిజన్ అధికారులు శనివారం ప్రశంశల జల్లు కురిపించారు. ఓ ప్రాణాన్ని కాపాడడం చాలా గొప్ప విషయమని వారు అభినందించారు. అనంతరం డ్యూటీ ఆఫీసర్ ఏఎస్సై ప్రసాద్ బలవన్మరణానికి పాల్పడిన ఆ వ్యక్తికి కౌన్సిలింగ్ నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com