వరుడు తనపై సింధూరం చల్లాడన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకుంది ఓ వధువు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జరిగింది. శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉండగా.. వధూవరులు బంధుమిత్రులతో కలిసి మాణిక్పుర్ చేరుకున్నారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజల వేళ వరుడు మద్యం తాగి వచ్చాడు. మైకంలో వధువుకు సిందూరం పెట్టలేక ఆమెపై చల్లటం ప్రారంభించాడు. తర్వాత వధువుపై చేయి చేసుకోవటంతో ఆ యువతి పెళ్లి రద్దు చేసుకుంది.