మాజీ మంత్రి బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి 5 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముని విశాఖలో కబ్జా చేయలేదని నిరూపిస్తే అదే లే అవుట్లో తనను పాతిపెట్టాలని జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సవాల్ చేశారు. విశాఖలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలినేని వియ్యంకుడు విశాఖలో భూకబ్జాకు పాల్పడ్డాడని తన వద్ద ఆధారాలున్నాయన్నారు. నేను నిరూపిస్తా. బాలినేని రాజకీయాలను తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బాలినేని బంధువులు చేసిన భూకబ్జా వివరాలు ఆయన వెల్లడించారు