తెలుగుదేశం పేదల కోసం పుట్టిన పార్టీ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఎన్టీ రామారావు జయంతోత్సవ వేడుకలలో భాగంగా శనివారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి స్థానం కల్పించిన మహనీయుడు అన్నారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీకి స్థానం వచ్చింది అంటే ఆనాడు ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ తో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన అనుబంధం ఉందని అన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఆయనకె దక్కుతుందని అన్నారు.
ఆడవారికి సమాన హక్కులను కల్పించింది కూడ ఆయనే అని చెప్పారు 6 నెలల్లోజగన్ జైల్ కి పోతారని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యులు బుద్ధ వెంకన్న మాట్లాడుతు ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ఆనాటి పరిస్థితులే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ శాసనసభ్యులు పీవీజీర్ నాయుడు, ఎం శ్రీ భారత్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, ఎస్. కోట ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి, భీమిలి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు, విశాఖప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, రాష్ట్ర కమిటీ నాయకులు ఎండి నజీర్, పీలాశ్రీనివాసరావు, సిహెచ్ పట్టాభిరామ్, ఓమ్మి సన్యాసిరావు, వి స్ న్ మూర్తి యాదవ్, కోళ్ల రాంప్రసాద్, లోడగల కృష్ణ, బోండా జగన్, పుచ్చ విజయ్ కుమార్, ఆరిటి మహేష్, గంట నూకరాజు, చిక్కాల విజయ్ బాబు, ప్రసాదల శ్రీనివాసరావు, పైల ముత్యాల నాయుడు, బైరెడ్డి పోతన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.