గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్ అధికారులకు సూచించారు. శనివారం ఘంటసాల గ్రామంలోని జగనన్న లేఅవుట్ ను ఆయన పరిశీలించారు. ఈ లేఔట్ లో గృహ నిర్మాణాలు వేగవంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా గ్రామాల్లో కూడా గృహ నిర్మాణాలు వేగవంతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తహసిల్దార్ బి. రామానాయక్, ఎంపీడీవో కే. వి. సుబ్బారావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.