బీజేపీ పార్టీ రాష్ట్రంలో వైసీపీ అక్రమాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ప్లానింగ్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా నంద్యాల జిల్లా నుంచి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బైరెడ్డి శబరిని నియమించారు. ఈ మేరకు శనివారం డా. బైరెడ్డి శబరి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యే ల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగి పోతున్నాయని అన్నారు. భూ కబ్జాలు, ఇసుక, మట్టి తవ్వకాలు, కమిషన్లు ఇలా వీరి అక్రమ దందాల గురించి చెప్పుకుంటే పోతే ముగింపు అనేది ఉండదన్నారు. ఎవరైనా మీ నియోజక వర్గ ఎమ్మెల్యే లేదా వారి అనుచరుల అవినీతి, అక్రమాలకు సంబంధించి వివరాలను మా ముందుకు తీసుక వస్తే వారి ఆగడాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని హామీ ఇస్తున్నామన్నామని ఆమె తెలిపారు.