అకాల వర్ష ప్రభావిత మండలాల్లో దెబ్బతిన్న పంటల వల్ల నష్టపోయిన ప్రతి రైతును కలిసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి, స్పెషల్ అధికారి కోన శశిధర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటనరీ హాలులో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, స్పందన గ్రీవెన్స్ క్వాలిటీ డిస్పోజల్ పై జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలానీ సమూన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి, స్పెషల్ అధికారి కోన శశిధర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి రైతు దగ్గరికి స్వయంగా వెళ్లి ధైర్యం చెప్పాలని వ్యవసాయ అధికారులను సూచించారు ఆదేశించారు.