భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను నేటి తరం చిన్నారుల్లో పెంపొందించేందుకుగాను శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి ఉచిత సంగీత శిక్షణ తరగతులను శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి శనివారం ప్రారంభించారు. సంగీత శిక్షణలో 18 సంవత్సరముల అనుభవం కలిగిన సంగీత గురువు కళ్యాణిచే శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని నాగిని రవి సింగారెడ్డి కోరారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నేటి తరంలో చిన్నారులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తమ వంతుగా ఈ వేసవి కాలంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.