ఆఫ్రికా దేశమైన కాంగోలో వరద బీభత్సం సృష్టించింది. కుంభవృష్టిగా కురుస్తున్న వానలతో దక్షిణ కివు ప్రావిన్స్‌లో నదులకు వరదలు పోటెత్తాయి. ఈ వరదల ధాటికి 176 మంది దుర్మరణం చెందగా, మరో 200 మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కాగా 227 మృతదేహాలను గుర్తించినట్లు సివిల్ సొసైటీ సభ్యుడు కసోల్ మార్టిన్ చెప్పారు. ఈ భారీ ర్షాలకు 700 పైగా ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి.