మణిపూర్‌లో జాతుల మధ్య జరిగిన హింసలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వివరాలను అధికారులు వెల్లడించారు. అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య భారీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 200 మందికి పైగా గాయాల పాలయ్యారని పేర్కొంటున్నాయి. కాగా, బుధవారం నుంచి ఉద్రిక్తంగా మారిన మణిపూర్‌లో 10 వేల మంది సైన్యం, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa