పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని ఆదివారం స్థానికులు కనుగొన్నారు. యువకుని మృతదేహం తల భాగం పగిలిపోయి భయానకంగా కనబడుతుంది. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అయితే స్థానికులు ఎవరు గుర్తుపట్టలేక పోవడంతో చనిపోయిన యువకుడు స్థానికేతరుడు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.