పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలలో గంట్యాడ మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు 578 మార్కులు సాధించి మండలంలో టాపర్గా నిలిచారు. మండలంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని మజ్జి భార్గవి, నరవ లోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ పాఠశాల విద్యార్థిని భాగ్యశ్రీ 578 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. గంట్యాడ మండలంలో ఈ ఏడాది 821 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయిగా 622 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది టెన్త్ 75. 8% నమోదయింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 8 శాతం పైగా ఉత్తీర్ణత పెరిగింది. మండలంలోని బోనంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మదనాపురం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించారు.