అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. 'అల్లూరి వీరమరణం పొంది నేటికి వందేళ్లు. నేటి తరం వారికి ఆయన సంకల్పం, ధీరత్వం, పోరాట పటిమ గురించి తెలియాలి. అల్లూరికి భారతరత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలి. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa