దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత రెండ్రోజులుగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో 1839 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్నటితో పోలిస్తే దాదాపుగా 540 కేసులు తగ్గాయి. ఇక గత 24 గంటల్లో కోలుకున్న వారిలో 3861 మంది ఉన్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 25178కు చేరింది.