రాజధాని లాంటి అతి పవిత్రమైన ప్రదేశంలోనూ పేదవాడికి స్థానం ఉండాలనేదిసీఎం జగన్ ఉద్దేశమని, అమరావతి అయినా, విశాఖ అయినా.. పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలని సీఎం భావిస్తున్నారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. పేదల పక్షాన నిలిచేవారంతా ఇళ్ల స్థలాల విషయంలో జీవో–45ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలన్నారు. పేద ప్రజలకు వ్యతిరేకమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణంపై హైకోర్టు తీర్పును పేదల పక్షాన పోరాడే వామపక్షాలు, ప్రజా సంఘాలు స్వాగతించాలన్నారు.