ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం అబద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ మొత్తం అబద్ధం. మేం ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆప్ లాంటి నిజాయితీ గల పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.