తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తో ప్రవేశించిన భక్తుడు ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో చిత్రికరించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. శ్రీవారి ఆలయంలోని సీసీ కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.