పల్నాడు జిల్లాలో రబీ సీజన్ లో వరి సాగు చేసిన రైతులు అకాల వర్షాలకు నిండా మునిగారు. వరి కోత దశలో వారం రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీశాయి. గాలులతో పాటు వచ్చిన అకాల వర్షానికి పంట నేలకొరిగింది. వర్షపు నీరు పంటపై ప్రవహించడంతోపాటు పొలంలో నీరు నిలవడంతో ధాన్యం తడిచిపోయి మొలకలు వస్తున్నాయి. పంట కోయకుండానే ధాన్యం నుంచి మొలకలు వస్తున్నాయని ఆదివారం రైతులు వాపోతున్నారు.