విశాఖలో ఓ రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్ లో ఆదివారం ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేజీహెచ్ మార్చురికి తరలించారు. అనంతరం మృతుని వివరాలు సేకరించగా చనిపోయిన వ్యక్తి కోమటిపల్లి సతీష్ కుమార్ గా గుర్తించారు. మర్రిపాలెంలోని డీజిల్ లోకో షెడ్ లో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యానికి బానిసై చనిపోయి ఉంటాడని మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగి చనిపోయాడా. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.