భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా 87 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు అనుభవం కలిగి ఉండాలి. www.bankofbaroda.in/careers ద్వారా మే 11లోపు అప్లై చేసుకోవచ్చు.