అక్కివలస, ఆమదాలవలస, మెట్టక్కివలస తదితర ప్రధాన వీధుల లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ చెవిటమ్మ అమ్మవారి ఊరి పండగలు ఈ నెల 5 వ తేదీ నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం నవదుర్గలు, కాంతారా వేషాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బంధువులు, స్నేహితుల రాకతో కన్నుల పండగ గా జరుగుతున్నాయి. మెట్టక్కివలస, అక్కివలస సంబంధిత కమిటీ సభ్యులు సకల ఏర్పాట్లు చేశారు. అక్కివలస, మెట్టక్కివలస తదితర గ్రామాలలో వైభవముగా శ్రీశ్రీశ్రీ చెవిటి అమ్మ తల్లి అమ్మవారి ఉత్సవములు వైభవముగా జరుగుతున్నాయి. ఈనెల ఐదవ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ అమ్మవారి పండగలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆదివారం అమ్మవారి ఘటాలు వీధులలో భక్తుల కోలాహలం మధ్య ఊరేగాయి. అక్కివలస, మెట్టక్కివలస, టీచర్స్ కాలనీ, గొల్ల వీధి, పుట్ట వీధి, హడ్కో కాలనీ, గాంధీనగర్, మండల వీధి, వాంబే కాలనీ తదితర వీధులలో ఊరేగించారు. అమ్మవారి ఘటాలు ఎత్తుకున్న పేరంటాల కాళ్ళను మహిళలు ముర్రాఠాలతో కడిగి అమ్మవారికి పండ్లు కాయలు సమర్పించుకున్నారు. ఈనెల 9వ తేదీ మంగళవారం అమ్మవారికి అణుపు ఉత్సవం ఎంతో వైభవముగా జరగనుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.