ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తూరులో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 02:42 PM

నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు వ్యతిరేకించే సమయం ఏర్పడిందని జిల్లా సిపిఎం నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సోమవారం నాడు కొత్తూరు మండల కేంద్రంలో ప్రచార భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు చైతన్యపరిచారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దించటానికి ప్రతి ఒక్కరు కృషి చేసి ఓటు అనే ఆస్త్రాన్ని ఉపయోగించాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు సైతం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోవిందరావు తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com