పలాస మండలంలోని, బ్రాహ్మణతర్లా - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండలంలో ఉత్తమ ఉత్తీర్ణత శాతంతో పాటు 12 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా సోమవారం నాడు బ్రాహ్మణతర్లా, లక్ష్మీపురం, నీలిభద్ర, కేదారిపురం, పూర్ణ భద్ర, అమలకుడియా గ్రామాలలో గల ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల ఇంటింటికి ఉపాధ్యాయులు వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఫలితాలు పొందారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఎస్వీ. రమణారావు, కొయ్యల శ్రీనివాసరావు, డి. జనార్ధన రావు , బి. కిషోర్, ఎస్. భీమశంకర్, వి. విష్ణాచారి, ఎమ్. మోహన రావు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్. రమేష్ బాబు పాల్గొన్నారు.