కడప నగరంలోని కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సొంత సోదరుడే హత్య చేసినట్లు సమాచారం. కడప నగరంలోని కుమ్మరికుంటకు చెందిన ఇషాక్ (25) ను రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడం, అతడు పెద్దదర్గా వద్ద ఉన్నట్లు తెలియడంతో అతడి సోదరుడు దర్గా వద్దకు వచ్చాడు. అక్కడ అన్నదమ్ముల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇంతలో తమ్ముడు తన వద్దనున్న కత్తి తీసుకుని అన్న ఇషాకన్ ను పొడవడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హసన్ తెలిపారు.