పొన్నూరు పట్టణంలోని నేతాజీ నగర్ ఓవర్ బ్రిడ్జి రోడ్ పై స్థానిక కలప వ్యాపారులు తమ కలపను రోడ్ల మీదే గుట్టలు గుట్టలుగా వేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారు. రైల్వే స్టేషన్, రైతుబజార్ కు వెళ్లే రహదారిలో ఇలా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై గుట్టలు గుట్టలుగా కలపవేసి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తున్న వ్యాపారులపై పట్టణంలో పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్ వ్యాపారులకు నోటీసులు పంపి రోడ్డుపై వేసిన కలపను తీయించిన యధా రాజా తథా ప్రజా అన్న చందనంగా వ్యాపారులు ట్రాఫిక్కుకు అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక మున్సిపల్ అధికారులు రోడ్లపై కలపను తీయించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.