ప్రజా సమస్యల పరిష్కారం కోసమే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గంగాధర్ నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ పరిధిలోని పెద్ద మిట్టపల్లి, చిన్న మిట్టపల్లి, నెల్లేపల్లి హరిజనవాడ ఎస్టి కాలనీలో ఆయన పర్యటించారు, ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని గత నాలుగు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందింది లేనిది స్వయంగా అడిగి తెలుసుకున్నారు, ప్రజల నుండి సీఎం జగన్ కు విశేష ఆదరణ లభిస్తుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో శ్రీదేవి, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.