చిత్తూరు ఒకటవ పట్టణ సీఐ నరసింహారాజును కర్నూలుకు బదిలీ చేస్తూ ఇన్చార్జ్ సిఐగా సిసిఎస్ లో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డినీ నియమిస్తూ అనంతపురం రేంజ్ డిఐజి అమ్మి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం భాస్కర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఒకటవ పట్టణ సీఐగా నరసింహారాజు గత రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఎన్నో కేసులను ఛేదించి ఉత్తమ ప్రతిభ కనబరిచి, అజాత శత్రువుగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు.