చైనా దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వం వేటు విధిస్తూ టొరెంటో నుంచి తరమివేసింది. చైనా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఇటీవల చట్టసభ ప్రతినిధి మైఖేల్ చాంగ్ ఆరోపించారు. ఈ విషయంలో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్నఆరోపణలపై మైఖేల్‌ను టార్గెట్ చేసింది. ఈ విషయంలో టొరెంటోలో ఉన్న ఆ దేశ దౌత్యవేత్త జావో వీయిను దేశం నుంచి పంపిస్తున్నట్లు కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలనీ జాలీ తెలిపారు.