పొన్నూరు పట్టణంలో మంగళవారం జిల్లాలోని విద్యుత్ శాఖ ఏఈలు, ఏడిఈ లు 40 బృందాలుగా ఏర్పడి విద్యుత్ సర్వీసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 2798 సర్వీసులను తనిఖీలు చేశారు. 59 సర్వీసులపై కేసులు నమోదు చేశారు. 3. 24 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఏ డి ఈ సురేంద్రబాబు , బాపట్ల ఈఈ జి ఆంజనేయులు, వివిధ మండలాలకు చెందిన ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద తనిఖీల వివరాలు అధికారులు వెల్లడించారు.