జాతీయ, అంతర్జాతీయంగా భారత రెజ్లర్లు అనేక పధకాలు అందించి నేడు రోడ్డున పడ్డారని అంతర్జాతీయ రెజ్లర్లను చూసే విధానం ఇదేనా అని పొన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కా శ్రీనివాస్ అన్నారు. పొన్నూరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం క్రీడాకారులతో కలిసి ఆయన రెజ్లర్లుకు మద్దతుగా నిరసన తెలిపారు. బిజెపి నేత జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా ఢిల్లీ నడివీధులపై దీక్ష కు ఉపక్రమించగా ఇప్పటివరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని పేర్కొన్నారు. భేటీ పడావో - భేటీ బచావో అంటూ ప్రచార ఆర్భాటాలకు ముందుండే బిజెపి సర్కారు బ్రిజ్ భూషణ్ పై చర్యలకు ఉపక్రమించకపోవటం సిగ్గుమాలిన చర్యని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పొన్నూరు మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్-2 అధ్యక్షులు కూరపాటి సతీష్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు చలికొండ రవిబాబు, పట్టణ మైనారిటీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.