అకాలవర్షాలలో దెబ్బతిన్న పంటలు, నష్టపోయిన రైతులు వివరాల సేకరణకు బుధవారం నుంచి సర్వేచేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 14 మండలాల్లో మిర్చి, జొన్న, మొక్కజొన్న, వరి, తదితర పంటలు దెబ్బతిన్నట్లు కలెక్టర్ ప్రభుత్వా నికి ప్రాథమిక నివేదిక పంపారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులతో కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఇంతియాజ్ లు చర్చించారు.