14 మండలాల్లో దెబ్బతిన్న పంటలు, నష్టపోయిన రైతులు, కౌలు రైతుల వివరాల జాబితాలను రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ నెల 16 నుంచి ప్రదర్శి స్తారు. దీంతో పాటు జాబితాలపై సోషల్ ఆడిట్ జరుగుతుందని అగ్రిజేడీ. నున్నా వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 21న జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల జాబితాను కలెక్టర్ ప్రభుత్వానికి పంపుతారని అధికారులు తెలిపారు.